ISI | నలుగురి అరెస్ట్

ISI | నలుగురి అరెస్ట్

ISI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఐఎస్ఐతో సంబంధాలున్న టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

లక్నోలో రైల్వే స్టేషన్లు వంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పక్కా సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు ఆపరేషన్ నిర్వహించి నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ఆధారంగా మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.

Leave a Reply