22Wards | క్యాతన్‌పల్లిలో భారీ బందోబస్తు…

22Wards | క్యాతన్‌పల్లిలో భారీ బందోబస్తు…
22Wards | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : క్యాతన్‌పల్లిలో కాసేపట్లో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరుగనున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య ఘర్షణలు సంభవించడంతో, ఈసారి కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
క్యాతన్‌పల్లిలో మొత్తం 22 వార్డులున్నాయి. బీఆర్‌ఎస్-సీపీఐ కూటమి 14, కాంగ్రెస్-7, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. ఛైర్మన్ పదవి కోసం మేజిక్ ఫిగర్ సాధించినప్పటికీ, గతంలో బీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థానం దక్కకపోవడంతో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే.
గత ఘర్షణల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు, భద్రతా చర్యలు కచ్చితంగా అమలు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలకు హాజరయ్యే అవకాశం ఉన్నారు. గతంలో పరస్పరం రాళ్లు రువ్వడం, కేసులు నమోదైన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు పెంచారు. ఈ ఎన్నికకు ఫలితాలు, పార్టీలు ఎదుర్కొనే పరిస్థితులు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
