2nd ODI | రెండో వన్డేకు నితీశ్ కుమార్ రెడ్డి దూరం!
2nd ODI | రెండో వన్డేకు నితీశ్ కుమార్ రెడ్డి దూరం!
2nd ODI | టీమిండియాకు షాక్..
తొడ కండరాల గాయంతో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైన ఆల్‌రౌండర్
రెండో వన్డే కోసం జట్టులో మూడు కీలక మార్పులు చేసిన భారత్
2nd ODI | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొడ కండరాలు పట్టేయడంతో (హ్యామ్‌స్ట్రింగ్ సమస్య) అతడు మ్యాచ్ ఆడలేకపోతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. నితీశ్ గైర్హాజరీ నేపథ్యంలో భారత జట్టు తుది కూర్పులో మార్పులు చేసింది. రెండో వన్డే కోసం మొత్తం మూడు మార్పులు చేసిన టీమ్ మేనేజ్‌మెంట్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లకు అవకాశం కల్పించింది. వీరు నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దుబే, ప్రసిద్ధ్ కృష్ణ స్థానాల్లో జట్టులోకి వచ్చారు.
ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి మరో పోరు మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు జట్టులోకి వచ్చిన యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం విశేషం. నితీశ్ గాయం తీవ్రతపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అయితే అతడి ఫిట్‌నెస్‌పై వైద్య బృందం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
