ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సర్దార్ స్వరాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పాపన్న గౌడ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పాపన్న గౌడ్ గారి సేవలను స్మరించుకున్నారు.

ఆయన చూపిన ధైర్యసాహసాలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ మాట్లాడుతూ పాపన్న గౌడ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర ,మాజీ ఎమ్మెల్యే మోహన్ గౌడ్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు పకిరాయ గౌడ్ , జిల్లా అధ్యక్షుడు మల్లయ్య గౌడ్ వెంకటయ్య గౌడ్ నారాయణ గౌడ్ , శ్రీధర్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply