Petition | మూసీ ప్రక్షాళన కేసులో…

Petition | మూసీ ప్రక్షాళన కేసులో…
Petition | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వానికి కీలక ఊరట లభించింది. గాంధీ సరోవర్ అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఎన్జీటీ తిరస్కరించింది.
మూసీ ప్రాజెక్టు పరిధిలో గాంధీ సరోవర్ నిర్మాణంపై పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఆరోపిస్తూ పటోళ్ల కార్తిక్‌రెడ్డి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ, అందులో పేర్కొన్న అంశాలకు తగిన ఆధారాలు లేవని భావిస్తూ దానిని కొట్టివేసింది. దీంతో మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ తీర్పుతో ప్రాజెక్టు అమలులో ఉన్న అడ్డంకులు తొలగినట్లయ్యాయని అధికారులు భావిస్తున్నారు.
