భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు..

భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు..
చెన్నూర్, ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు చెన్నూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి పురస్కరించికొని స్థానిక ప్రతాప్ మారుతి, హనుమాన్, పంచముఖ, పుప్పాల హనుమాన్, బడా హనుమాన్, చోటహనుమాన్ ఆలయాలు భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలలో పాల్గొనడంతో పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రతాప్ మారుతి హునుమాన్ ఆలయం వద్ద నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
