మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు

గట్టుప్పల, ఆంధ్రప్రభ : తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు ఎస్ఐ సంజీవరెడ్డి వారి సిబ్బందితో కలిసి ఈరోజు గట్టుప్పల మండల కేంద్రంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మైనర్లు వాహనాలు నడుపుతున్న ఘటనపై పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి మోటార్ సైకిల్ నడుపుతున్న మైనర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.

వారి తల్లిదండ్రులను పిలిపించి జరిమానా విధించి,కౌన్సిలింగ్ నిర్వహించారు. చిన్న వయసులోనే పిల్లలకు వాహనాలు ఇవ్వడం చాలా ప్రమాదకరమని, ఇది చట్టవిరుద్ధంగా నేరమని తెలిపారు. నిబంధనల ప్రకారం మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపరాదని, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని పలు సూచనలు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని తెలిపారు.

Leave a Reply