అరసవిల్లి ఆలయంలో మహదాశీర్వచనములు, వేదసదస్సు

అరసవిల్లి ఆలయంలో మహదాశీర్వచనములు, వేదసదస్సు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణ ఉత్సవాలలో భాగంగా చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారం ఉదయం 8 గంటల నుండి సదస్యం, మహదాశీర్వచనములు, వేదసదస్సు, పండితులకు సత్కార కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు, భాస్కరభట్ల శ్రీ రామ మూర్తి శర్మ, బంకుపల్లి రమేష్ శర్మ చంద్రశేఖర్ శర్మ, ఆరవల్లి చంద్రశేఖర్ శర్మ, సాయికుమార్ శర్మ, రామకృష్ణ శర్మ, మోహన్ రావు, సూర్యనమస్కారాలు పండితులకు సత్కరాలు జరిగాయని కార్యనిర్వహణాధికారి కె .వి ప్రసాద్ తెలిపారు.

Leave a Reply