cskvsrr| ఐపీఎల్‌లో నేడు బిగ్‌ఫైట్

cskvsrr| ఐపీఎల్‌లో నేడు బిగ్‌ఫైట్
గౌహతి వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌లో ఈ రోజు రసవత్తరమైన పోరు జరగనుంది. సోమవారం గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఢీకొననున్నాయి. గత సీజన్‌లో దారుణంగా విఫలైన సీఎస్కే ఈ సీజన్‌లో పుంజుకుంటుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. గాయంతో ధోనీ రెండు వారాలకు పైగా ఐపీఎల్‌కి దూరంగా కానున్నాడు. తాజాగా డివాల్డ్ బ్రెవిస్‌కు కూడా రెస్ట్ ఇచ్చారు. ఇక రాజస్థాన్ రాయల్స్ మాత్రం రియాన్ పరాగ్ యువ నాయకత్వంలో ముందుకెళ్లనుంది. రాజస్థాన్‌కు బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు అనుభవం ఉన్న బౌలర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

అయితే ఈ మ్యాచ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ మ్యాచ్‌లో గత సీజన్‌లో రాజస్థాన్‌కు ఆడిన సంజూ శాంసన్ ఇప్పుడు సీఎస్కే వైపు బరిలోకి దిగుతుండగా.. చెన్నై చిన్న తలాగా పేరొందిన జడేజా ఇప్పుడు రాజస్థాన్‌కి ఆడుతుండటం విశేషం. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న సంజూ శాంసన్‌ను భారీ ట్రేడ్ డీల్‌తో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఇందుకోసం రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్‌ను కూడా సీఎస్కే వదులుకుంది. చెన్నైకి ఎన్నో విజయాలు అందించిన జడ్డూ ఇప్పుడు అదే సీఎస్కేకి అపోజిట్‌గా ఆడుతున్నాడు. దాంతో ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు పోటాపోటీగా తలపడతాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇరు జట్ల మధ్య 31 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ 16 మ్యాచ్‌లలో విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లలో గెలిచింది. దాంతో ఈ రోజు జరిగే మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగనుంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు అంచనా
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురేల్, రవీంద్ర జడేజా, దాసున్ శానక, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, ఆడమ్ మిల్నే.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనా
సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్.

