అశ్వ వాహనం పై లక్ష్మీనర్సింహాస్వామి..

అశ్వ వాహనం పై లక్ష్మీనర్సింహాస్వామి..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం స్వామి వారు అశ్వ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వ వాహన సేవను ఆలయ పరిధిలోని గ్రామ పుర వీధుల గుండా ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల హారతులు, గోవింద నామస్మరణల మధ్య వాహన సేవ వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా స్వామి వారి ఊరేగింపును దర్శించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply