రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు..
రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాయలసీమ జిలాల్లో నేడు, రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేసింది. దీని ప్రభావంతో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని చెప్పింది. అలాగే విభిన్న వాతావరణ పరిస్థితుల వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు.
ఉరుములుతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద, బహిరంగ ప్రాంతాల్లో ఉండరాదని హెచ్చరించారు. మరో వైపు ఉత్తారాంధ్రలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని.. విజయనగరం, పార్వతీపురం, పోలవరం జిల్లాలో.. తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని అధికారులు తెలియచేశారు. అలాగే ఎల్లుండి 12 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సమాచారం.
