మొగుళ్ళపల్లి మండలంలో దొంగల హల్చల్

మొగుళ్ళపల్లి మండలంలో దొంగల హల్చల్

ఒక బైక్. 15 వేల రూపాయల నగదు
కరెంటు వైర్లు అపహరణ
సంఘటన స్థలం వద్దనే పోలీసుల కేసు నమోదు

మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ : గత రెండు మూడు రోజుల నుండి మొగుళ్ళపల్లి మండల పరిధిలోని మూడు గ్రామాలలో వేరువేరుగా దొంగలు హల్చల్ సృష్టించారు. ఒక గ్రామంలో 1,60,000 పల్సర్ బైక్ ను దొంగతనం చేయగా.. మరొక గ్రామంలో 15 వేల రూపాయల నగదును అపహరించారు. మరొక గ్రామంలో రైతులకు సంబంధించిన కరెంటు వైర్లను దొంగలించారు వరుస సంఘటనలతో మొగుళ్ళపల్లి మండలంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే.. మొగుళ్ళపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన దొమ్మటి వెంకటేష్ అనే వ్యక్తికి సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని దొంగలు అపహరించారు.

అదే గ్రామంలోని బోనగిరి శశిరేఖ ఇంటిలో తలుపులు పగలగొట్టి ప్రవేశించి కూడా దొంగతనం చేసే ప్రయత్నం చేస్తూ పారిపోయారు. అదే రోజు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గుర్రపు పుల్లమ్మ ఇంటిలో ఉదయం 10:30 మధ్యలో ఇంటిలో చొరబడి ఇంట్లో ఉన్న ఆల్మర పగలగొట్టి 15 వేల రూపాయలు దొంగలించి పరారయ్యారు మండలంలోని మొ ట్లపల్లి గ్రామంలో రైతులకు సంబంధించిన విద్యుత్తు వైర్లను దొంగలించి దుండగులు పరారయ్యారు.

బాధితుల ఫిర్యాదు మేరకు మొగుళ్ళపల్లి ఎస్సై ఎం సురేష్ బాధితుల ఇళ్ల వద్దకే వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మొగుల్లపల్లి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగు కేసులలో బాధితుల ఇంటి వద్దనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం గమనార్ధం,

Leave a Reply