మక్తల్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా సుమిత్రమ్మ

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండల సర్పంచుల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్పంచుల సర్వసభ్య సమావేశంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా నవినోళ్ళ సుమిత్రమ్మ (సంగంబండ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా రవితేజ (ఉప్పరపల్లి), ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు గౌడ్ (పంచలింగాల), కార్యదర్శిగా డి. అశోక్ (నర్సిరెడ్డిపల్లి), కోశాధికారిగా హెచ్. మహేష్ (కొండదొడ్డి) ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా అధ్యక్షురాలిగా ఎన్నికైన నవినోళ్ళ సుమిత్రమ్మను పలువురు సర్పంచులు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

తనకు ఈ అవకాశం కల్పించినందుకు మండల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపిన సుమిత్రమ్మ, సర్పంచుల సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల సహకారంతో గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు పాల్గొన్నారు.

Leave a Reply