ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు..

ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు..

నందిగామ, ఆంధ్రప్రభ : ఏదైనా ఒక సంఘటన జరిగితే తప్ప అధికారులు చలనం రాదనటానికి నందిగామలో జరుగుతున్న సంఘటన ఉదాహరణ నిన్న చందాపురంలో పలువురు వాంతులువిరోచనాలు కావడంతో పలు ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన విషయం విధితమే ఈ ఘటన జరిగిన తరువాత జిల్లా అధికారులు చందాపురం గ్రామంలో పర్యటించి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జిల్లా అధికారి కలెక్టర్ ఆదేశాలతో ఫుడ్ అధికారులు దారుడు లు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు పట్నంలోని స్వీట్ షాపులు, హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిన్న చందాపురం గ్రామంలో జరిగిన ఫుడ్ పాయిజన్ తో ఒకసారిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉలిక్కి ప‌డ్డారు. చందర్లపాడు బస్టాండ్ లో గల రామలింగేశ్వర స్వామి స్వీట్స్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా నడుపుతుండటంతో అధికారులు కేసు నమోదు చేశారు. స్వీట్స్ లో హానికరమైన కలర్స్ కలిపిన స్వీట్ లను ల్యాబ్ కు పంపించనున్నామ‌ని అధికారులు తెలిపారు.

నందిగామలోని విజయ దుర్గ భోజన హోటల్ లో అపరిశుభ్ర వాతావరణ వంటశాలలో వంట చేయడంపై అధికారులు కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న షాపులపై ఫైన్, చర్యలు తీసుకుంటామ‌ని అధికారులు అన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శ్రీనివాస్, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు స్వీట్ షాపులు, హోటల్స్ పై తనిఖీలు జ‌రిగాయి. ప్రతి ఒక్క షాపు యజమానులు ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు తీసుకోవాలని లేదంటే షాపులు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగుతునే ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.