hero vijay| ఆ రెండు స్థానాల నుంచి పోటీ

hero vijay| ఆ రెండు స్థానాల నుంచి పోటీ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి కూటములు లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనే టార్గెట్‌తో మొత్తం 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించాడు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, టీవీకే అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేస్తుండడం విశేషం. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్ననట్లు వెల్లడించారు. టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున విల్లివాక్కం నుంచి పోటీ చేయనున్నారు. చెన్నైలో జరిగిన టీవీకే సభలో విజయ్ ఈ మేరకు వెల్లడించారు. మాజీ మంత్రి సెంగొట్టియాన్ గోబిచెట్టిపాళ్యం నుంచి పోటీ చేయనున్నారు.
