భద్రాచలంలో సీతారాముల దర్శనం..
కడెం, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలోని భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఆదివారం కడెం మండలం పెద్దూరు గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు జీపి వార్డు సభ్యులు, హనుమాన్ దీక్ష పరులు కూడా పాల్గొన్నారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పెద్దూరు కడెం జీపి పరిధిలోని పెద్దూర్ తండా, కొలం గూడెం, కడెం ప్రాంతాల ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అలాగే రాబోయే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ 105 కొబ్బరికాయలు కొట్టి సీతారాముల స్వామిని వేడుకున్నట్లు సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ తెలిపారు.
