“పోలీస్ అక్క”కు జాతీయ స్థాయి గౌరవం..

“పోలీస్ అక్క”కు జాతీయ స్థాయి గౌరవం..

నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : “SKOCH గుర్తింపు మా సేవలకు మరింత బాధ్యతను తెచ్చిందని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల పేర్కొన్నారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం అమలు చేస్తున్న పోలీసు అక్క కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డును జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ ఢిల్లీలో అందుకున్నారు. నేటి సమాజంలో మహిళలు, విద్యార్థినుల భద్రత అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మారిన వేళ, నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ ప్రారంభించిన “పోలీస్ అక్క” కార్యక్రమం, విద్యార్థినులతో పాటు మహిళల భద్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సమగ్ర కమ్యూనిటీ పోలీసింగ్ మోడల్‌గా నిలిచి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

“పోలీస్ అక్క” కార్యక్రమం మహిళా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో నడిచే కమ్యూనిటీ పోలీసింగ్. ఈ కార్యక్రమం ద్వారా బాలికలకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” పై అవగాహన కల్పించడమే కాకుండా, భావోద్వేగ, మానసిక, శారీరక భద్రత పై కూడా శిక్షణ అందిస్తున్నారు. మహిళా పోలీస్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోల్లింగ్ చేస్తూ “డయల్-100” కాల్స్ తో అత్యవసర సేవలతో ప్రజలకు తక్షణ సహాయం అందిస్తున్నారు.

Leave a Reply