గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

-రఘునాథపల్లి ఎస్ఐఐ డి.నరేష్

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా.. ఉండాలని రఘునాథపల్లి ఎస్ఐ డి.నరేష్ సూచించారు. సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా ఓటీపీలు, బ్యాంక్ పిన్లు లేదా ఇతర వ్యక్తిగత బ్యాంకింగ్ వి వర్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ షేర్ చేయవద్దని సూచించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులు లేదా ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో వచ్చే కాల్సు నమ్మవద్దని. ఆవి మోసపూరిత కాల్స్ అయ్యే అవకాశముందని చెప్పారు. అలాగే తెలియని లింకుల ద్వారా ఎటువంటి చెల్లింపులు వె యకూడదని ప్రజలకు సూచించారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ఎప్పుడూ అధికారిక యాప్ లు లేదా అధికారిక వెబ్ భలను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇలాంటి మోసాల నుంచి తమమ తాము రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే 1967 లేదా 100కాల్ చె సి తెలపగలరని ఎస్ఐఐ డి.నరేష్ అన్నారు..

Leave a Reply