కర్నూలులో విషాదం….

కర్నూలులో విషాదం….

చెరువులో మహిళ మృతదేహం లభ్యం.

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని భూపాల్ నగర్‌కు చెందిన తిరుపతమ్మ (40) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం… శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆమె భర్త శంకర్ నాయక్‌తో కలిసి ఇంట్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. అనంతరం ఆమె కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడికక్కడ గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గార్గేయపురం చెరువులో తిరుపతమ్మ మృతదేహం తేలుతూ కనిపించడం విషాదాన్ని మిగిల్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతమ్మ మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సమస్యల కోణంలోనూ, ఇతర అనుమానాస్పద అంశాలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Leave a Reply