ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..

పామర్రు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం గోపువానిపాలెంలో ఏర్పాటు చేసిన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆవిష్కరణ చేశారు. పా

బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి, ఆర్థిక పురోభివృద్ధికి అండగా నిలిచిన ఘనత అన్న ఎన్టీఆర్ కే దక్కుతుందని రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ మార్గం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని సుహాసిని తెలిపారు.

సంక్షేమం అనే పదానికి పర్యాయపదం స్వర్గీయ ఎన్టీఆర్ అని మంత్రి రవీంద్ర అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగక కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ, వీరంకి వెంకట గురుమూర్తి, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.