Hyderabad | కారుకు మంటలు..

Hyderabad | కారుకు మంటలు..

Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలోని కేపాల్ వద్ద ఓ కారు అగ్నికి ఆహుతైంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న TS 03 EN 6575 నంబర్ గల వాహనంలో ప్రయాణ సమయంలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

కారు ఇంజిన్ నుంచి పొగ, మంటలు వస్తున్నట్లు గమనించిన యజమాని వెంటనే అప్రమత్తమై వాహనాన్ని ఆపి బయటకు దిగాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ సంఘటనను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో కారును పూర్తిగా ఆర్పేలోపే అది పూర్తిగా దగ్ధమైంది.