కమనీయం … శ్రీరాముని కళ్యాణం

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : శ్రీరామ నవమిని పురస్కరించుకొని భీంగల్ మండలంలో శ్రీ సీతా రాముల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని పిప్రి లొద్ది రామన్న ఆలయంలో అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ శ్రీ సీతా రాముల కల్యాణమహోత్సవాన్ని జరిపారు. ముందుగా సీతా రాముల ఉత్సవ విగ్రహాలను వేరు వేరు పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు.

మహిళలు మంగళ హరతులతో వెంట నడిచారు. డప్పుల చప్పుళ్ళు, బాజ భజంత్రీలు వెంట రాగ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు బుక, గులాలు, పూలు చల్లుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కళ్యాణం ప్రారంభం అయ్యింది. భక్తుల జయ, జయ ధ్యానల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు కల్యాణ వేడుక పూర్తి చేశారు.

శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తజనం మురిసి పోయారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ, వీడీసీ, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లొద్ది వేడుకలకు రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply