ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్‌లు..

ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్‌లు..
-ఏడాది నుంచి భారత్ పెట్రోల్ బంక్ సేవలు నిలిపివేత
-నెల రోజులుగా హెచ్‌పి బంక్‌లోనూ ఇంధనం అందుబాటులో లేదు
-దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్న వాహనదారులు
-రాత్రి వేళల్లో మరింత క్లిష్ట పరిస్థితులు
-తక్షణమే ఇంధన సరఫరా పునఃప్రారంభించాలని ప్రయాణికుల విజ్ఞప్తి..
స్టేషన్ ఘన్ పూర్ మార్చి24 ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామం రాకముందు ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు సంబంధించిన పెట్రోల్ బంక్ దాదాపు ఏడాది కాలంగా పనితీరు నిలిచిపోయి ఉండటంతో స్థాని క ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ప్పుడు ఈ బంక్ ద్వారా ఇప్పగూడెం, అక్కపల్లిగూడెం, రంగారాయి గూడెం, కోమటిగూడెం, సముద్రాల, విశ్వనాథపూర్, మరోపక్క పాలకు ర్తి తదితర సమీప గ్రామాల ప్రజలకు ఇంధనం సులభంగా అందుబా టులో ఉండేది. ప్రయాణికులు, రైతులు, ఉద్యోగులు రోజువారీ అవస రాల కోసం ఈ బంక్‌పై ఆధారపడుతూ సౌకర్యంగా ప్రయాణాలు సాగిం చేవారు. అయితే గత ఒక సంవత్సరం నుంచి బంక్‌లో పెట్రోల్ అందు బాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. అత్యవసర సమయంలో ఇంధనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది..
-హెచ్‌పి బంక్‌లోనూ పెట్రోల్ అందుబాటులో లేదు:
ఇక ఇదే ప్రాంతంలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియంకు సంబంధించిన పెట్రోల్ బంక్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. దాదాపు నెల రోజులుగా అక్కడ కూడా పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో ప్రయా ణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ గురించి అడిగితే ఇంకా రెండు రోజుల్లో వస్తుందంటూ యాజమాన్యం కాలం గడుపుతోందని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. మార్గమధ్యలో వాహనాలు నిలి చిపోతే నెట్టుకుంటూ ఇంటికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాహ నదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రెండు బంక్‌లు అందుబాటులో ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణా లు సాగించేవారు. ఇప్పుడు రెండూ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధి కారులు, బంక్ యాజమాన్యం స్పందించి తక్షణమే ఇంధన సరఫరాను పునఃప్రారంభించి ప్రజలకు ఊరట కల్పించాలని స్థానికులు, ప్రయాణి కులు కోరుతున్నారు.
