వార్డు అభివృద్ధే లక్ష్యం

వార్డు అభివృద్ధే లక్ష్యం

-ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను
-అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు స్కూల్ డ్రెస్సుల పంపిణీ
-ముఖ్య అతిథిగా 6వ వార్డు కౌన్సిలర్ బాలగాని అనిల్ గౌడ్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : వార్డు అభివృద్ధే నా లక్ష్యం…ప్రజల సమస్యలు నా దృష్టికి తీసుకరండి. వెంటనే పరిష్కారం కోసం కృషి చేస్తాను. ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తెలియజేయండి..వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తా నని వార్డు కౌన్సిలర్ బాలగాని అనిల్ గౌడ్ తెలిపారు. మంగళవారం స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలోని 6వ వార్డులోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు స్కూల్ డ్రెస్సు ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వార్డు కౌన్సిలర్ బాలగాని అనిల్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన చిన్నారులకు స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేశారు.

అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కేంద్రం పనితీరును అంగన్‌వాడీ టీచర్‌ను అడిగి తెలుసు కున్నారు. చిన్నారులకు సమయానికి గుడ్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. పిల్లలతో ముచ్చటించి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం కౌన్సిలర్ అనిల్ మాట్లాడుతూ వార్డులో చిన్నారుల అభి వృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టుతున్నాం..అంగన్‌వాడీ కేంద్రాలను మరిం త మెరుగుపరచి పిల్లల కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించ డమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ రమా దేవి, ఆయమ్మ ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.