ప్రజాపాలన చేతకాక పోలీస్ రాజ్యం నడుపుతుంది…
ప్రజాపాలన చేతకాక పోలీస్ రాజ్యం నడుపుతుంది…
- బీ ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన చేతకాక పోలీస్ రాజ్యం నడుపుతున్నదనీ బీ ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. కరీంనగర్ లోని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులను జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ను మంగళవారం రోజు అర్ధ రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కు చేరుకొని బీఆర్ఎస్ నాయకులను పరామర్శించి చల్ల హరిశంకర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన చేతకాక పోలీస్ రాజ్యం తీసుకువచ్చిందని ఆరోపించారు. అసెంబ్లీ లో మాజీ మంత్రులు, కేటిఆర్, హరీష్ రావులు ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని విమర్శించారు. ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కేవలం బారాస నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకగా బీ ఆర్ ఎస్ పార్టీ ఉన్నందున గొంతు నొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నదని అన్నారు. అర్థ రాత్రి క్రిమినల్ లా లాగా దొంగల లాగా ఇండ్లలోకి వచ్చి తలుపులు కొట్టి రాత్రులు అరెస్ట్ లు చేసే నీచ సంస్కృతిని బంద్ చేయాలని లేని పక్షంలో ప్రజావ్యతిరేకత ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
మీ ఈ కవ్వింపు చర్యలకు భయపడేది లేదని అడుగడుగునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. ఇలాంటి చర్యలు పురావృతం ఐతే జిల్లా బారస తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బారాస నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఇంచార్జి చుక్క శ్రీనివాస్, బీఆర్ ఎస్ వీ నగర అధ్యక్షులు బొంకూరి మోహన్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ యాదవ్, బారస కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, గణేష్, దినేష్, సతీష్, తదితరులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
