పేదల వైద్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ…

పేదల వైద్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ…
తాజాగా రూ.55.63 కోట్లు విడుదలతో 6,787 మందికి లబ్ది
కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో 1,268 మందికి రూ.10,40,48,895లు సహాయం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
58మందికి రూ.50,46,511లు ఆర్థిక సహాయం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పేదల వైద్యంపై ప్రత్యేక శ్రద్ధతో సీఎం చంద్రబాబు తాజాగా రూ.55.63 కోట్లు విడుదల చేశారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 58మందికి రూ.50,46,511లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చెక్కులు అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు 21నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 1,268 మందికి ఎల్ఓసీలు, రీ-ఎంబర్సుమెంటుల రూపంలో రూ.10,40,48,895లు అక్షరాలా పది కోట్ల నలభై లక్షల 48వేల 895 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసినట్లు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక చేయూత, వైద్య సహాయం, ఎల్ఓసీల ద్వారా 21నెలల్లో 1,36,240 మందికి రూ.1,241 కోట్లు ఆర్థిక సహాయం చేసినట్లు వివరించారు. తాజాగా సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధికి విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో మరో 6,787 మందికి లబ్ది కలుగుతుందని తెలిపారు.
వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయం కోరుతూ పేదలు పంపే దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తూ పేదల వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్ధిదారుల తరపున ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.
