నవోదయకు ఎంపికైన పాఠశాల విద్యార్థిని..
నవోదయకు ఎంపికైన పాఠశాల విద్యార్థిని..
అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ మధులిక గోవర్ధన్ రెడ్డి
ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థిని ఎం. కె. తన్వి 2026-2027 సంవత్సరానికి గాను నవోదయ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపిక కావడం పట్ల పాఠశాల చైర్మన్ గోవర్ధన్ రెడ్డి , డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి లు ఆనందం వ్యక్తపరిచారు. అదేవిధంగా విద్యార్థిని ఎం.కే.తన్వి నవోదయకు ఎంపిక అవడంతో పాఠశాల కరస్పాండెంట్ మధులిక గోవర్ధన్ రెడ్డి లు సోమవారం విద్యార్థిని శాలువా, మొమెంట్, పూల బొకేతో అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీమతి మధులిక గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆనందాన్ని ఇక్కడితోనే వదలకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదిగి మంచి సైంటిస్ట్ గా, డాక్టర్ గా, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నతమైన స్థానంలో నిన్ను చూడాలన్నదే మా ఆకాంక్ష అంటూ చిన్నారికి, తల్లిదండ్రులకు మా ప్రత్యేక అభినందనలు అంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మహిమ శ్రీ, ఇన్చార్జి సురక్షిని, తరగతి ఉపాధ్యాయురాలు సుమయ్య, అధ్యాపక బృందం తోటి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
