శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం…

శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం…
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని చిట్యాల ,రామ్ నగర్, ప్రజలకు శాశ్వత మంచి నీటి సమస్య పరిష్కారం కోసం, స్థానిక సర్పంచ్ తౌటం లక్ష్మి ఆదేశాల మేరకు నాలుగో వార్డ్ మెంబర్ తౌటం నవీన్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి, ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
గ్రామంలో ఉన్న నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం, మామిడికుంట చెరువు నుండి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్ కి నీటి సరఫరా చేయడం వల్ల గ్రామపంచాయతీ పరిధిలోని చిట్యాల , రామ్ నగర్ కాలనీ వాసులకు శాశ్వతంగా నీటి సమస్యను తీర్చడం జరుగుతుందని, ఎమ్మెల్యే కు వివరించారు. నిధులు మంజూరు చేయించి, సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలోగ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.
