టీపీసీసీ చీఫ్ కు బీజన దంపతుల సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరికి కాంగ్రెస్ నూతన జిల్లా కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహేష్ కుమార్ గౌడ్ ను శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
