భక్త జనంతో కిటకిటలాడిన భైరవ గుట్ట
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి మండలం పారుపెల్లి గుట్ట పై వెలసిన కాలభైరవ ఆలయం భక్తజణంతో కిటకిటలాడింది. ఆదివారం స్వామి వారి రోజు కావడంతో వివిధ పట్టణాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆ ప్రాంతమంత భైరవ నామ స్మరణతో మారు మోగింది. భక్తులకు కలకోట రమాదేవి సంతోష్ ల ఆధ్వర్యంలో అన్నప్రసాదాలు వితరణ చేశారు.
