దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు…
దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు…
కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలి : చైర్మన్
ఉట్నూర్, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలo కష్టించి పండించిన శనిగ ధాన్యాన్ని బయట దళారులకు తక్కువ ధరలకు విక్రయించి మోసపోవద్దని జైన్యూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాత్ రావు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలలోని నాగపూర్ గ్రామంలో ప్రజా మిత్ర రైతు మ్యాక్స్ పెడరేషన్ లిమిటెడ్, తెలంగాణ రాష్ట్ర మార్క్ పేడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శనిగల కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్, వైస్ చైర్మన్ బోనోత్ జైవంత్ రావ్ తో కలిసి శనగల కొనుగోలు కేంద్రాని ప్రారంబించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ ఇస్తునటువంటి మద్దతు ధర.5,875 రూపాయిలకు విక్రయించి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగంచేయాలని కోరారు, దాలరులతో మోసపోకుండా రైతులు ప్రభుత్వ కేంద్రంలో విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా మిత్ర ప్రతినిధులుకొమరం విఠల్ రావు, రాథోడ్ శేషారావు, పెందూర్ ప్రకాష్, ఆసిఫాబాద్ జిల్లా నాయకులు జగా దిరావు, పిల్డ్ ఆఫీసర్స్ జగన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

