22ndMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

22ndMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
22ndMarchCartoon | మారుతున్న సమాజంలో భార్యాభర్తల పాత్రలు
పురుషాహంకారం ఇంకా ఎందుకు కొనసాగుతోంది?
సుప్రీం కోర్టు వ్యాఖ్యల సందేశం
కార్టూన్‌లో చమత్కారంగా చెప్పిన నిజం

22ndMarchCartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సంసారం అనేది ఒక రథమైతే, భార్యాభర్తలిద్దరూ ఆ రథానికి రెండు చక్రాలు. ఆర్థిక విషయాలైనా, పిల్లల పెంపకమైనా. ఈ విషయంలో ఇప్పటికే సమాజంలో బాగా మార్పు వచ్చింది. ఈకాలం భర్తలు ఆడ-మగ పనులు అనే తేడా లేకుండా భార్యలకు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. కానీ తరతరాలుగా ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఇంకా పోలేదు. అదే, ఇది నా పని కాదు…ఇది నేనెందుకు చెయ్యాలి…ఈ ఆడపని నేను చెయ్యాలా? అదే పురుషాహంకారం.
చాలా కుటుంబాల్లో ఇంకా భార్య బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చినా, ఇంట్లో పనులన్నీ తానే చేసుకోవాలి తప్ప భర్త నుంచి కించిత్తు సహకారం ఉండదు. భర్త హాల్లో సోఫా మీద కాళ్ళుజాపుకుని కూర్చుని, “ఏమేవ్…కాఫీ…” అని గట్టిగా కేకేస్తే వంటింట్లో నుండి “తెస్తున్నానండీ…” అనే సమాధానం రావాల్సిందే…మరో నిముషంలో ఆయన గారి ముందు కాఫీ ఉండాల్సిందే…తనభార్య ఇంటిపనులు సరిగ్గా చేయడం లేదని కోర్టుకెక్కిన భర్తగారికి సుప్రీం అక్షింతలు వేసింది.
మీరు పెళ్ళాడింది భార్యను కానీ పని చేసే మనిషిని కాదు అని చురకలంటించింది. పనిలో పనిగా పురుష “మగా“నుభావులందరికీ ఒక విషయాన్ని ఉద్భోధించింది. ఇంటిపనులంటే భార్య బాధ్యత మాత్రమే కాదు, భార్యా భర్తలిద్దరిదీ…అని…కానీ ఇలాంటి విషయాల్లో చైతన్యం అనేది సమాజంలోంచి రావాలి, ఒక్కొక్కరి మనసుల్లోంచి రావాలి కానీ కోర్టు తీర్పుల వల్ల సాధ్యం కాదు.
ఉద్యోగం చేసి ఇంటికొచ్చిన భర్తకు తను చేయాల్సిన పనుల లిస్టు చూపిస్తున్న కార్టూన్ ఇది. ఇదే విషయాన్ని చమత్కారంగా చూపించిన ఆంధ్రప్రభ కార్టూన్. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్. ఔరా.
