ఘనంగా రంజాన్ వేడుకలు..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలో ముస్లిం సోదరులు శనివారం రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.భక్తి,శ్రద్ధలతో ఈద్గా ల వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు.ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయంగా రంజాన్ పండుగ (ఈద్ ముబారక్ ) తెలుపుకున్నారు.సమాజంలో శాంతి,సౌభ్రాతృత్వం,ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.

ఈద్ ఉల్ ఫితర్ పండుగను భక్తి శ్రద్ధలతో సోదర భావంతో ఘనంగా జరుపుకున్నారు.రంజాన్ నెల ముగిసిన తర్వాత జరుపుకునే ఈ పండుగ ముస్లిం లకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.ఒక నెల పాటు రంజాన్ ఉపవాసం చేసిన ఆనంతరం,నెలవంక దర్శనంతో షావ్వల్ మాసం ప్రారంభం అవుతుంది.

ఆ నెల మొదటి రోజున ఈద్ పండుగను జరుపుకుంటారు.ఈ రోజు అల్లాకు కృతజ్ఞతలు తెలిపే రోజుగా కూడా భావిస్తారు.ఈ కార్యక్రమంలో అహ్మద్, అజ్మత్ పాషా, అబ్దుల్ అజహారోద్దిన్, సల్మాన్, యూనుస్, నయాన్, మహ్మద్ సమీత్, సమీర్, షాహిద్, మహ్మద్ సాజీత్, అమీర్, ఆఫ్రీద్, సోఫియాన్, ఆషిక్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply