ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు…

ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు…

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని మండలంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా మండలం లోని ఆమిద్యాల, మోపిడి, రాకెట్ల, ఉరవకొండ పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న ఈ దర్గా మైదానంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు అక్కడికి చేరుకొని, నమాజ్ చదివి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరి కొకరు ఆలింగం చేసుకుని, రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదిన మన్నారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. అల్లా చల్లని దీవెనలతో, చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా సిఐ మహానంది, ఎస్సై జనార్దన్ నాయుడులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా అనుగ్రహం తో ప్రజలంతా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.