మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా దుంపల పద్మారెడ్డి నియామకం

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఖాళీగా ఉన్న డైరెక్టర్ పదవిని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. కాసాని బొందయ్య స్థానంలో దుంపల పద్మారెడ్డిని డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

శనివారం స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తానేదార్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేలిదే వెంకన్న నివాసంలో స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్‌లతో కలిసి దుంపల పద్మారెడ్డిని ఘనంగా శాలు వాతో సత్కారించి అభినందించారు.

పద్మారెడ్డి నియామకంపై గ్రామ స్తులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ అభి వృద్ధికి ఆయన కృషి చేస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హరిత ఇంద్రాసేనా రెడ్డి, ఉప సర్పంచ్ గాదె శాంత, నాయకులు ఎండీ అక్బర్, ఆకుల కృష్ణంరాజు, గాదె భాస్క ర్, మంతెన హరీష్, ఆకుల చంద్రమౌళి, మేకల ప్రవీణ్, నర్సయ్య, చంద్ర య్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply