నిరుపేదలకు దుస్తులు పంపిణీ…

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ ; రంజాన్ పండుగను పురస్కరించుకుని మండల పరిధిలోని మర్కోడు, ఆళ్లపల్లి పంచాయితీలో పాటు గుండాల, వరంగల్ కాటాపురం పలు పట్టణ ప్రాంతాల్లోని ముస్లింల కుటుంబాలతో పాటుగా ఇతర వర్గాలకు చెందిన నిరుపేద మహిళలు,ఒంటరి మహిళలు వికలాంగుల లబ్ధిదారులకు నూతన దుస్తులను పంపిణీ చేయడం జరిగిందని,స్థానిక ప్రముఖ కాంట్రాక్టర్, హర్వెస్టర్,సాంఘిక ఆర్థిక సహాయ దాతలు మహమ్మద్ ముక్తార్ హుస్సేన్ పాషా, మహమ్మద్ అఫ్రిద్ హుస్సేన్, మహమ్మద్ అమేర్ హుస్సేన్,మహమ్మద్ అమైరా (సయ్యదాని) తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఏటా పలు పట్టణ పల్లె ప్రాంతాలలోని ముస్లిం నిరుపేద మహిళలు, ఇతర వర్గాల నిరుపేద మహిళలకు సైతం చీరలను, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం ఆనవాయితీగా వచ్చిందన్నారు. ఇటీవల మర్కోడు పంచాయతీకి చెందిన అయ్యప్ప దీక్ష పరులకు సైతం పాతూరు తీగలంచ గ్రామశివారులో ఉడుములగుట్ట వద్ద కొలువుదీరిన నరసింహస్వామి ఆలయంలో అన్నదానం(భిక్ష)ను ఏర్పాటు చేయడం చేయడం జరిగిందని గుర్తు చేశారు.
ప్రముఖ కాంట్రాక్టర్, హార్వెస్టర్ ఆధ్యాత్మిక సేవాపరుడు, ముక్తార్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు, దుస్తులు సైతం పంపిణీలు చేసి, ఆళ్లపల్లి మండల ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకుంటూ మంచికి మారుపేరుగా ముస్లిం సోదరుడు ముక్తార్ పాషా కుటుంబం ఆధ్వర్యంలో మానవత్వం, దాతృత్వాన్ని చాటుకుంటూ సాంఘిక, సమాజ సేవతో సమానత్వాన్ని వ్యక్తపరిచిన ముస్లిం ముక్తార్ పాషా కుటుంబానికి ఉమ్మడి మండలాల నిరుపేద ప్రజలు, ఒంటరి, వితంతువు, దిక్కులేని అభాగ్యల మహిళలు కొనియాడడం విశేషం. కరుణ కాలం నుండి విశేషంగా సేవదృక్పథంతో సహాయ సహకారాలు అందించడంలో ఉత్సాహంగా పని చేయడం జరిగిందన్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ముస్లిం తమ కుటుంబ సభ్యులందరి పేరుమీద పేదలకు అందించే దానమే ఫిత్రానని తెలిపారు. ఫిత్రా అనగా ఉపవాసం ముగిసిన సందర్భంగా చేసే దానమని, ఈదుల్ ఫితర్ నమాజ్ ఆచరించడానికి ముందుగానే ఈఫిత్రా దానాన్ని తమ కుటుంబంలో ఉన్న పేద బంధువులకు, తమ వీధిలోని పేద ముస్లింలకు, ఉపవాసం పాటించే సమయంలో తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పుల నుండి విముక్తి పొందడమని, పేదలకు ఆహారం అందించే వారు కూడా ఆకలి బాధ లేకుండా ఈద్ పండుగను సంతోషంగా జరుపుకునేలా చేసే ఫిత్రాను జకాత్ అల్ ఫిత్ర్ అని కూడా పిలుస్తారని చెప్పారు.
ముస్లిం సోదరులు తమ ప్రాంతాల్లో కనిష్టంగా ఒక్కొక్క వ్యక్తికి రూ.120 చొప్పున, కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడి పేరుమీద లెక్కకట్టి ఫిత్రా దానం చేసెలా, దానధర్మ పుణ్యక్రియలు చేయాలని సూచించారు.
లేనియెడల రంజాన్ మాసంలో నిర్వహించిన ఉపవాసాలు, ఈద్ పండుగన ఈద్గాలో ఆచరించే ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ పూర్తి ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
