ఘనంగా ఎస్పీ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : గ్రామాల్లో యువత చెడు మార్గాలకు దూరంగా ఉండేలా ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. యువతను సన్మార్గంలో నడిపించడం సమాజ అభివృద్ధికి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
గురువారం ఉప సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టు ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్పీ సంకీర్త్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల కార్తీక్ హాజరై ఎస్పీని శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్పీకి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉప సర్పంచ్లు గ్రామాభివృద్ధిలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు మామిడి కవిత, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, జిల్లా అధికార ప్రతినిధి బానేష్, రేగొండ మండల అధ్యక్షుడు నరేష్, కొయ్యూరు మండల అధ్యక్షుడు సర్వేందర్, గోరికొత్తపల్లి మండల అధ్యక్షుడు పిండి ప్రభాకర్ తదితరులు, వివిధ గ్రామాల ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.
