బాధితులకు మొబైల్ ఫోన్ల అప్పగింత

హసన్‌పర్తి (ఆంధ్రప్రభ): సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ ద్వారా రికవరీ చేసిన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను హసన్‌పర్తి పోలీసులు బాధితులకు అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి తప్పిపోయిన మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు హసన్‌పర్తి సీఐ ఎ. మహేందర్ తెలిపారు.

బాధితులు ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వాటి వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసి ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ట్రాక్ చేసి రికవరీ చేసినట్లు వివరించారు. అనంతరం ఫోన్లను అసలు యజమానులకు అప్పగించారు. తమ ఫోన్లు తిరిగి అందడంతో బాధితులు సీఐ మహేందర్‌తో పాటు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.