నార్సింగి జామా మసీదులో ఘనంగా రంజాన్ కార్యక్రమాలు

నార్సింగి, ఆంధ్రప్రభ ; నార్సింగి జామా మసీదులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ముస్లిం నాయకుడు ఎం.డి బాకర్ తెలిపారు. ప్రతిరోజూ సేహ్రీతో ఉపవాసాలు ప్రారంభమై, సాయంత్రం ఇఫ్తార్ విందులతో ముగుస్తాయని చెప్పారు.

మసీదులో ప్రత్యేక నమాజులు, తరావీహ్ ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జకాత్ ద్వారా పేదలకు సహాయం చేసే సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. చివరి పది రోజుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ప్రజలు పాల్గొని ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply