ప్రకృతి వ్యవసాయమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష..

ప్రకృతి వ్యవసాయమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినపంటలవల్లే ప్రజల ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని ఊట్కూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డిఅన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ రైతు వేదిక భవనంలో నేషనల్ ఆన్ నేచురల్ పామింగ్ పథకం కింద ఎంపికైన అమీన్ పూర్, ఓబులాపూర్ రైతులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం అలవర్చుకోవాలనిఅన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినవివిధరకాలదాన్యం కలుషితం కాకుండా ఉంటుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దాన్యం మనుషులు తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. గోఆధారిత వ్యవసాయం పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారంచుట్టిందని అన్నారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్ పథకం కింద ఎంపికైనఅమీన్ పూర్, ఓబులాపూర్ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలువచ్చేపంటలుసాగు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కలిగే లాభాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు సత్యనారాయణరెడ్డి, టప్ప నాగేష్, ఏ ఈ ఓ లు రజిత స్వరూప తదితరులుపాల్గొన్నారు.
