కుటుంబ సభ్యులను పరామర్శించించిన మాజీ మంత్రి..

కుటుంబ సభ్యులను పరామర్శించించిన మాజీ మంత్రి..
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న, తన స్వగ్రామమైన దండేపల్లి మండలం లింగాపూర్ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు విషయం తెలుసుకున్న మాజీ రోడ్డు, భవనాలశాఖ మంత్రి జీవన్ రెడ్డి గోవింద్ నాయక్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మన్నలను పొందారు. ఆయన ఏ పార్టీ లో ఉన్న ప్రతి ఒక్క నాయకునితో ఆప్యాయంగా పలకరించేవారని గోవింద్ నాయక్ ఇక లేరు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మలేక పోతున్నారని అన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు.
