యుద్దాల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దు..

యుద్దాల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దు..

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యుద్ధాల పేరుతో ప్రజలపై భారాలు మోపే విధానాలు ఆపి అందరికీ వంట గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చౌటుప్పల్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని యుద్ధం వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుందని, అనేక దేశాలలో గ్యాస్ పేదలకు అందడం లేదని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇరాన్ లో అను ఆయుధాలు చేస్తున్నారనే అభియోగంతో ఆదేశంపై దాడి చేసి అకారణంగా పాఠశాలలు, ఆస్పత్రులపై బాంబులు వేసి పసి పిల్లలను, సాధారణ ప్రజలను చంపటం దుర్మార్గమన్నారు. రెండు దేశాల దాడుల ఫలితంగా ఇరాన్ హార్మోజ్ జల సంధిని మూసివేయడం జరిగిందని, దీనితో భారతదేశం తో సహా అన్ని దేశాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇదేవిధంగా యుద్ధం కొనసాగితే మన దేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, సహాయ కార్యదర్శి ఉడత రామలింగం, బద్దులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply