State BC JAC | నల్ల బ్యాడ్జీలతో బీసీజేఏసీ నిరసన

State BC JAC | నల్ల బ్యాడ్జీలతో బీసీజేఏసీ నిరసన
State BC JAC | మోత్కూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, రాష్ట్ర బీసీ జేఏసీ(State BC JAC) పిలుపుమేరకు ఈ రోజు మున్సిపల్ కేంద్రంలోని పూలే చౌరస్తాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నాయకులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జనరల్ సీట్లలో గెలిచేది బీసీలేనని, అగ్రకులాలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ వచ్చేవరకు ఎన్నికలు నిర్వహించనని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్ కాస్త తగ్గించి బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలు ఇక సాగనివ్వమని పలు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకుల భుజంపై చెయ్యేసి జనరల్ ఓసీలదే అని చెప్పుకునే రోజులు మారుస్తామని మీకు దమ్ముంటే జనరల్ సీట్లలో బీసీలకు బి ఫామ్ లు ఇచ్చి బీసీల మీద నిజమైన ప్రేమ చూయించుకోవాలని డిమాండ్ చేశారు.
కల్లబొల్లి మాటలు నమ్మడానికి బీసీలు ఇక్కడ సిద్ధంగా లేరని, జనరల్ సీట్లలో కచ్చితంగా బీసీలo పోటీ చేసి గెలుస్తామని ఆర్టికల్ 18 ప్రకారం మీ వారసత్వ బిరుదులు తెoపుతామని బీసీ నాయకులు సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కలిమెల నరసయ్య, జంగ శీను, బయ్యని పిచ్చయ్య, ఎడ్ల నరేష్, పోన్నేబోయిన రమేష్, పోచం సోమయ్య, గజ్జి మల్లేష్, దాసరి తిరుమలేష్, ఆనందాస్ విద్యాసాగర్, మొరిగాల శీను, అన్నెపు సత్యనారాయణ, ప్రభాకర్, టైలర్ శీను, బుర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
