శ్రీశైలంలోఉగాది మహోత్సవములు..

శ్రీశైలంలోఉగాది మహోత్సవములు..

రెండో రోజు చండీ హోమం.. అమ్మవారికి కైలాస వాహన సేవ..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో రెండవ రోజు ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఉగాది మహోత్సవముల సందర్భముగా మంగళవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్యపూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటలనుండి స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించబడ్డాయి. అమ్మవారియాగశాలలో చండీహోమం జరిపించబడ్డాయన్నారు. ఉత్సవములో భాగంగా అమ్మవారికి విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు చేయడం జరిగిందన్నారు. సాయంత్రం 5.30గంటలకు సాయంకాల పూజలు,జపానుష్ఠానములుజరిపించబడుతాయన్నారు.

స్వామి అమ్మవార్లకు కైలాసవాహనసేవ..

ఉగాది మహోత్సవాలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ జరిపించబడుతుందన్నారు . ఈ సేవలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కైలాసవాహనసేవపై వేంచేబు చేయించి విశేషపూజాదికాలు జరిపించబడుతాయన్నారు . తరువాత గ్రామోత్సవం నిర్వహించబడుతుందన్నారు. కైలాసవాహనంపై అధిరోహించిన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని, సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోందన్నారు.

అమ్మవారికి మహాదుర్గ అలంకారం..

ఉగాది ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తికి మహాదుర్గ అలంకారం, గ్రామోత్సవం జరుగనున్నాయి. అష్టభుజాలు గల ఈ దేవి శంఖం,చక్రం, గద, పద్మం, త్రిశూలం, ఖడ్గం మొదలైన వాటిని ధరించి దర్శనం ఇవ్వనున్నారు. అదే విధంగా గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటుల వేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ కర్ణాటక డోలు కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయన్నారు. కార్యక్రమంలో పేద పండితులు కార్యనిర్వాహణాధికారి పాల్గొంటారని తెలిపారు.

Leave a Reply