రంజాన్ పండగ కోసం..
రంజాన్ పండగ కోసం..
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : రంజాన్ పండగ రోజు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనాలు చేసుకోవడం కోసం నిర్మల్ పట్టణంలోని ఈద్గా వద్ద పూర్తి వసతులతో ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ఈద్గా ప్రాంతంలో జరుగుతున్న పనులను పలువురు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన ఈద్గా ప్రత్యేక ప్రార్థనలకై మున్సిపల్ శాఖ పరంగా ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తుందని, ఈసారి మున్సిపల్ శాఖ ఇప్పటికే ఏర్పాట్ల పనులు ప్రారంభించిందన్నారు. ఈద్గా వద్ద శానిటేషన్, టెంట్, సౌండ్ సిస్టమ్, కార్పెట్లు.. వేసవి కాలం వలన మంచి నీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పండగ రోజు ముస్లిం సోదరులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇమ్రానుల్లా, ముజహిద్, రఫీ, జకీ, ఇర్ఫాన్, కత్తి నరేందర్, అడప పోశెట్టి, గోపు గోపి, మున్సిపల్ DE, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
