పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన కేంద్రమంత్రి..

పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన కేంద్రమంత్రి..

శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలుగు ప్రజలు స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని, . ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి నిచ్చిందని కొనియాడారు.

ఈ సందర్భంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 58 అడుగుల స్టేట్యూ అఫ్ శాక్రి ఫైజ్ విగ్రహం ఆవిష్కరణ జరగడం గర్వకారణమన్నారు. ఈ విగ్రహం భావితరాలకు వారి త్యాగాన్ని గుర్తుచేస్తూ చరిత్రలో నిలిచిపోతుందని,. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు కేంద్రమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.