సీఎం చంద్రబాబు సీరియస్‌

సీఎం చంద్రబాబు సీరియస్‌

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ వ్యవహరంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో పుట్టా మహేశ్‌ పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పుట్టా మధును పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్ఠానం ఆదేశించింది. ఈ ఘటనపై మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించారు. వ్యక్తులు, నేతల బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వొద్దని చెప్పారు. డ్రగ్స్‌ వంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని సీఎం చంద్ర హెచ్చరించారు.