నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు

జైనూర్, ఆంధ్రప్రభ ; నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గూడ మామడ సర్పంచ్ కొముర యశోద కేశవరావు అన్నారు. గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన బోరును ఆదివారం ఆమె ప్రారంభించారు. రాబోయే వేసవి కాలంలో నీటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని.. ఏ సమస్య ఉన్న పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరాటే శివాజీ తదితరులు పాల్గొన్నారు.