TLM Mela | ప్రతి ప్రభుత్వ పాఠశాల‌ను ఆదర్శంగాతీర్చిదిద్దాలి

TLM Mela | ప్రతి ప్రభుత్వ పాఠశాల‌ను ఆదర్శంగాతీర్చిదిద్దాలి

  • హస్నాపూర్ టిఎల్ఎం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
  • పాఠశాల పని తీరుపై కలెక్టర్ ప్రశంస
  • కలెక్టర్ కే ప్రశ్నలు వేసిన విద్యార్థులు

TLM Mela | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇలా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కలెక్టర్ రాజర్ష శా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని హస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు నిర్వహించిన గణిత టీఎల్ఎం మేళ‌(TLM Mela)ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు.

టీఎల్ఎం కార్యక్రమాన్ని పరిశీలించి అనంతరం పాఠశాల తరగతి గదిలో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బడి తోటను, నాటిన చెట్లను పరిశీలించి కలెక్టర్ ప్రశంసించారు. అదేవిధంగా కలెక్టర్ ఒక మొక్కను నాటారు. పాఠశాలలను సందర్శించిన కలెక్టర్, అధికారులు, పీవోలు, మంత్రులు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయడం సహజం కానీ హస్నాపూర్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ప్రశ్నలు వేయాల్సి ఉండగా విద్యార్థులే కలెక్టర్ కు ప్రశ్నలు(questions) వేయడం విశేషం.

విద్యార్థుల ప్రశ్నలకు కలెక్టర్ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. హస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దడంలో గణిత ఉపాధ్యాయుడు అజయ్ పవార్‌ను, ఉపాధ్యాయులను కలెక్టర్ కొనియాడారు. పాఠశాల మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

టి ఎల్ ఎం కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హస్నాపూర్ సర్పంచ్ జాదవ్ విమల బాయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తిరుపతి గణిత ఉపాధ్యాయులు అజయ్ పవా ర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply