Ntr | ప్రశాంత్ నీల్ మూవీ వెనుక ఏం జరుగుతోంది..?

Ntr | ప్రశాంత్ నీల్ మూవీ వెనుక ఏం జరుగుతోంది..?

Ntr | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీపై భారీ అంచనాలు
వార్ 2 ప్రభావం.. షూటింగ్‌కు బ్రేక్ ఎందుకు?
కథలో మార్పులు చేసిన ప్రశాంత్ నీల్?
రిలీజ్ డేట్ మారడానికి కారణం ఇదేనా?
డ్రాగన్ మూవీ కొత్త రిలీజ్ డేట్ మార్చి 7నా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు త్వరలో క్లారిటీ రానుందా?

Ntr | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి కాంబోలో క్రేజీ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ.. డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ (Ntr Fans) ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వార్ 2 మూవీ ప్లాప్ అవ్వడంతో.. ఎన్టీఆర్ ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. అయితే.. ఈ క్రేజీ మూవీకి ఇప్పటికే ఒకసారి రిలీజ్ డేట్ మార్చారు. ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ మారబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇంతకీ.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు..? అసలు పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటి..?

Ntr

Ntr | మార్పులు చేర్పులు..

ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర షేక్ చేస్తుందని.. భారీగా కలెక్షన్స్ వస్తాయని.. కెరీర్ లో మరచిపోలేని సినిమా అవుతుందని ఎన్టీఆర్ బలంగా నమ్మాడు కానీ.. నమ్మకం నిజం కాలేదు. దీంతో వార్ 2 ఎఫెక్ట్ ఎన్టీఆర్ పై పడింది. ఈ సినిమా రిజెల్ట్ (Result) తెలిసన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లిపోయాడు యంగ్ టైగర్. అలాగే వార్ 2 ఎఫెక్ట్ ప్రశాంత్ నీల్ పై కూడా పడింది. ఈసారి ఎన్టీఆర్ ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి కావడంతో కథ పై మళ్లీ వర్క్ చేశాడు. అలాగే కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

Ntr

Ntr | మార్చి 7న డ్రాగన్..?

ఎన్టీఆర్ వార్ 2 తర్వాత విదేశాలకు వెళ్లడం.. షూటింగ్ ఆగిపోవడం.. ప్రశాంత్ నీల్ మళ్ళీ కథ పై వర్క్ చేయడం తదితర కారణాల వలన రిలీజ్ డేట్ పై ఆ ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తోంది. షూటింగ్ స్టార్ట్ చేసిప్పుడు 2026లో జనవరి 9న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. అదే డేట్ కి కోలీవుడ్ (Kollywood) లో విజయ్ జన నాయగన్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఆ సినిమాతో పోటీ ఎందుకని అనుకున్నారో ఏమో కానీ.. ఈ ఇయర్ లో జూన్ 25న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే.. షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడం వలన మళ్లీ పోస్ట్ పోన్ కానుందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. నెక్ట్స్ ఇయర్ లో మార్చి 7కి లాక్ చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో డ్రాగన్ మూవీ ఎప్పుడు వస్తుందనేది సస్పెన్స్ గా మారింది. మరి.. ఈ సస్పెన్స్ కి తెరదించేలా రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Ntr

Leave a Reply